అక్షరటుడే, వెబ్‌డెస్క్: Energy drinks | శరీరంలోని వ్యర్థాలను శుద్ధి చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచే ‘ఫిల్టర్లు’ మూత్రపిండాలు. అయితే, నేటి వేగవంతమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం, పానీయాలు ఈ కీలక అవయవాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.
సాధారణంగా మద్యం (Alcohol) తాగితేనే కిడ్నీలు పాడవుతాయని అందరూ అనుకుంటారు. కానీ, మనకు తెలియకుండానే మనం తాగే కొన్ని ‘ఎనర్జీ డ్రింక్స్’ ఆల్కహాల్ కంటే వేగంగా కిడ్నీల kidney ను డ్యామేజ్ చేస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Energy drinks | ఎనర్జీ డ్రింక్స్
ప్రస్తుతం యువతలో ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఒక ఫ్యాషన్‌గా మారింది. తక్షణ శక్తి కోసం వీటిని ఆశ్రయిస్తున్నారు. అయితే నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డ్రింక్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దాదాపు 70 శాతం వరకు దెబ్బతినే అవకాశం ఉంది. వీటిలో ఉండే అధిక రసాయనాలు, కెఫిన్, కృత్రిమ చక్కెరలు కిడ్నీలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ తరహా పానీయాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటిని ముట్టుకోవడం ప్రాణాపాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీల రక్షణకు సహజ సిద్ధమైన మార్గాలు
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖరీదైన డ్రింక్స్ అవసరం లేదు, తగినంత ‘నీరు’ తాగితే చాలు. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. అలాగే, మార్కెట్ పానీయాలకు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకునే నిమ్మరసం, గ్రీన్ టీ, అల్లం టీ, పుదీనా టీ వంటి హెర్బల్ పానీయాలు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి.
వంటగదిలోనే ఔషధాలు
మన వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలు కిడ్నీలకు రక్షణ కవచంలా పనిచేస్తాయి.
నిమ్మకాయ: ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇది సహజమైన డీటాక్స్ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
వెల్లుల్లి: వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ కణాలను వాపుల నుంచి రక్షిస్తాయి. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించే ఎంజైమ్‌లను ఉత్తేజితం చేస్తుంది.
సుగంధ ద్రవ్యాలు: దాల్చిన చెక్క, మెంతులు, జీలకర్ర వంటి వాటితో చేసిన కషాయాలు కూడా కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అందుకే, తాత్కాలిక శక్తినిచ్చే రసాయన పానీయాల జోలికి వెళ్లకుండా, సహజ ఆహారపు అలవాట్లతో మన మూత్రపిండాలను కాపాడుకోవాలి.
