అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market)లో సుదీర్ఘ నష్టాలకు తెరపడిరది. ఎనిమిది సెషన్ల తర్వాత మార్కెట్ లాభాలతో ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్(Sensex) మరోసారి 81 వేల మార్క్‌ను దాటింది.
బుధవారం ఉదయం సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. తొలుత కొంత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటన తర్వాత తిరిగి లాభాలబాటపట్టి స్థిరంగా పెరిగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 80,159 నుంచి 81,068 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ(Nifty) 24,605 నుంచి 24,867 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 715 పాయింట్ల లాభంతో 80,983 వద్ద, నిఫ్టీ 225 పాయింట్ల లాభంతో 24,836 వద్ద స్థిరపడ్డాయి.
పీఎస్‌యూ బ్యాంక్స్ మినహా..
బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్(PSU Bank) ఇండెక్స్ మినహా మిగిలిన అన్ని సూచీలు గ్రీన్‌లోనే ముగిశాయి. బ్యాంకెక్స్ 1.44 శాతం, టెలికాం 1.26 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.22 శాతం, హెల్త్‌కేర్ 1.13 శాతం, రియాలిటీ 1.11 శాతం, యుటిలిటీ 1.03 శాతం, ఇన్‌ఫ్రా(Infra) 0.76 శాతం, ఆటో 0.74 శాతం, పవర్ 0.73 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.71 శాతం లాభాలతో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.32 శాతం నష్టపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.16 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.91 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.82 శాతం పెరిగాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,797 కంపెనీలు లాభపడగా 1,360 స్టాక్స్ నష్టపోయాయి. 134 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 150 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 120 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 3.20 లక్షల కోట్ల మేర పెరిగింది.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్ 5.54 శాతం, కొటక్ బ్యాంక్ 3.45 శాతం, ట్రెంట్ 3.31 శాతం, సన్‌ఫార్మా 2.58 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.43 శాతం పెరిగాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 1.10 శాతం, ఎస్‌బీఐ 0.97 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.86 శాతం, టాటా స్టీల్ 0.86 శాతం, ఆసియా పెయింట్ 0.62 శాతం నష్టపోయాయి.