అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chhattisgarh encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో (Bijapur district) జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు.
బీజాపూర్ జిల్లాలోని వాయువ్య ప్రాంతంలోని అటవీ కొండల్లో ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం అదే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) నలుగురు మావోలు చనిపోయారు. ఆదివారం సైతం బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర యాదవ్ తెలిపారు.
Chhattisgarh encounter | కీలక నేతలు..
బీజాపూర్‌లో శనివారం నలుగురు మావోయిస్టులు మరణించారు. వారిని డివిజనల్ కమిటీ సభ్యుడైన సీనియర్ కేడర్ దిలీప్ వేద్జా, ఏరియా కమిటీ సభ్యులు మాద్వి కోసా, లఖీ మడ్కామ్, పార్టీ సభ్యురాలు రాధా మెట్టాగా గుర్తించారు. ఈ నలుగురూ మావోయిస్టుల నేషనల్ పార్క్ ఏరియా కమిటీలో (Maoist National Park Area Committee) చురుకుగా ఉన్నారని ఎస్పీ చెప్పారు. ఆదివారం హతమైన మావోయిస్టుల గుర్తింపు ఇంకా నిర్ధారించాల్సి ఉందన్నారు. ఈ ఆపరేషన్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) సిబ్బందితో పాటు, కోబ్రా సిబ్బంది పాల్గొన్నారు.
Chhattisgarh encounter | ఆయుధాలు స్వాధీనం
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఏకే-47 రైఫిల్, ఇన్‌సాస్ రైఫిల్, కార్బైన్, 303 రైఫిల్‌తో సహా ఆరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో వేర్వేరు ఎదురుకాల్పుల్లో కనీసం 20 మంది మావోయిస్టులు మరణించారు.