HomeUncategorizedOperation Kagar | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు జవాన్లకు గాయాలు

Operation Kagar | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు జవాన్లకు గాయాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Kagar | మావోయిస్టుల అంతమే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్​ నిర్వహిస్తున్నాయి. 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వర్షాకాలంలో మావోలకు నిద్ర లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. దీంతో ఛత్తీస్​గఢ్​ (Chhattisgarh)లోని అడవులను బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

బీజాపూర్​ జిల్లా నేషనల్​ పార్క్​ (Bijapur National Park) అటవీ ప్రాంతాన్ని సుమారు 25 వేల మంది బలగాలు, పోలీసులు చుట్టుముట్టాయి. నాలుగు రోజులుగా అటవీ ప్రాంతంలో సెర్చ్​ ఆపరేషన్​ (Search Operation) చేపడుతున్నాయి. ఈ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు కూంబింగ్​ చేపట్టారు. ముఖ్యంగా మావోయిస్టు కీలక నేత హిడ్మా (Hidma) టార్గెట్​గా ఆపరేషన్​ చేపట్టినట్లు సమాచారం.

Operation Kagar | కీలక నేత హతం

ఈ ఆపరేషన్​ భాగంగా ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్​ మావోయిస్టుల స్నైపర్​, కీలక నేత సోధీ కన్నా హతమయ్యాడు. తాజాగా మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇంకా ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. కాగా నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్పులు ఆపి పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని పౌర హక్కుల నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

Operation Kagar | చర్చలు లేవు

ఆపరేషన్​ కగార్​ (Operation Kagar)తో కకావికలం అయిన మావోయిస్టులకు ఇదివరకే తాము శాంతిచర్చలకు సిద్ధమని ప్రకటించారు. పౌర హక్కులు, కమ్యూనిస్ట్​ నాయకులు కూడా ఆపరేషన్​ కగార్​ ఆపి చర్చలు జరపాలని డిమాండ్​ చేస్తున్నారు. అయితే కేంద్ర మాత్రం మావోయిస్ట్​లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఆయుధాలు వీడి లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని.. అంతకు మించి వారితో ఎలాంటి చర్చలు ఉండవని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.