21
అక్షరటుడే, కోటగిరి : Kotagiri | ఎన్నికల అధికారులతో ఆదివారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో (Sub-Collector Vikas Mahato) సమావేశం అయ్యారు. కోటగిరి రైతు వేదికలో, పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా కల్యాణ మండపంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ గంగాధర్, కోటగిరి ఎంపీడీవో విష్ణు, పోతంగల్ ఎంపీడీవో చందర్, ఎంఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు.