అక్షరటుడే, బాన్సువాడ : Banswada | స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారులు జిల్లాలో పర్యటిస్తున్నారు. నామినేషన్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక అధికారి సత్యనారాయణ రెడ్డి బాన్సువాడ మండలంలోని కోనాపూర్ (Konapur) నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు.
ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది నియామకాలపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలు, అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ (Nomination) దాఖలు చేసేలా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
