అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market) నష్టాల బాటలోనే పయనిస్తోంది. ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోతోంది. దీంతో వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ ప్రధాన సూచీలు(Benchmark indices) నష్టాలతోనే ముగిశాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 177 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే నష్టాలలోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 80,201 నుంచి 80,677 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ(Nifty) 24,587 నుంచి 24,731 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అయ్యాయి.
ప్రధాన సూచీలు ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 97 పాయింట్ల నష్టంతో 80,267 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 24,611 వద్ద స్థిరపడ్డాయి. ప్రారంభ లాభాలను ఐటీ(IT) సెక్టార్ నిలబెట్టుకోలేకపోతోంది. వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలతో ప్రారంభమైనా చివరికి నష్టాలతోనే ముగిసింది. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్(RBI MPC Meeting) వివరాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఈసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్ రేంజ్ బౌండ్‌లో కొనసాగింది.
దూకుడు కొనసాగించిన పీఎస్‌యూ బ్యాంక్స్..
మార్కెట్ నెగెటివ్‌గా ఉన్నా.. పీఎస్‌యూ బ్యాంక్(PSU bank) స్టాక్స్‌లో మాత్రం దూకుడు కొనసాగుతోంది. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.06 శాతం పెరగ్గా.. మెటల్ సూచీ 1.11 శాతం పెరిగింది. కమోడిటీ 0.65 శాతం, పీఎస్‌యూ 0.60 శాతం, ఆటో 0.30 శాతం, బ్యాంకెక్స్ 0.22 శాతం లాభాలతో ముగిశాయి. టెలికాం(Telecom) ఇండెక్స్ 0.93 శాతం, రియాలిటీ 0.79 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.78 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.39 శాతం, యుటిలిటీ 0.35 శాతం, ఇండస్ట్రియల్ 0.19 శాతం, ఐటీ ఇండెక్స్ 0.07 శాతం నష్టపోయాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం నష్టపోగా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.04 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,052 కంపెనీలు లాభపడగా 2,042 స్టాక్స్ నష్టపోయాయి. 157 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 141 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 156 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 1.43 శాతం, అదానిపోర్ట్స్ 1.41 శాతం, టాటా మోటార్స్ 1.18 శాతం, బీఈఎల్ 0.96 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.76 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఐటీసీ 1.19 శాతం, ఎయిర్‌టెల్ 1.18 శాతం, ట్రెంట్ 0.99 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.93 శాతం, టైటాన్ 0.85 శాతం నష్టపోయాయి.