Homeజిల్లాలుకామారెడ్డిBJP Mlc | ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య

BJP Mlc | ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి:BJP Mlc |  ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి(Anji Reddy), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమురయ్య(Komuraiah) పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాల(Saraswati Shishumandir School) ప్రాంగణంలో గురువారం రాత్రి తపస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. 12 ఏళ్ల పోరాటం తర్వాత బీజేపీ(BJP)కి రెండు ఎమ్మెల్సీలు దక్కాయన్నారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. తమను గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ.. తమను గెలిపించినందుకు రుణపడి ఉంటామన్నారు. ఉపాధ్యాయ ఎన్ రోల్మెంట్ లో ప్రైవేట్ టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందని, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఈ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు విద్యార్థులు(Students), విద్యావ్యవస్థ సమస్యల పరిష్కారం కూడా ముఖ్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో స్టేట్ సిలబస్(State Syllabus) ఉండదని, సిబిఎస్సి సిలబస్(CBSC Syllabus) మాత్రమే ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో వన్ ఎడ్యుకేషన్ పాలసీ(One Education POlicy) వచ్చే అవకాశం ఉందని, దానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

టీచర్లకు వారి సమస్యల పైన తప్ప విద్యార్థుల సమస్యలను పట్టించుకోరని ప్రభుత్వం(Government) దృష్టిలో ఉందని, ఈ విధానం మారాలన్నారు. ఎడ్యుకేషన్ విధానం ఇంప్రూవ్ కావాలన్నారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని తెలిపారు. అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీ(MLC)లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.