అక్షరటుడే, కామారెడ్డి : Minister Seethakka | వ్యవసాయం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, అందుకే మార్కెట్ యార్డుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. భిక్కనూరు మండలంలో రూ. 92.80 లక్షల వ్యయంతో చేపట్టిన వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మార్కెటింగ్ కమిటీ కాంప్లెక్స్‌లో (Marketing Committee Complex) 11 షాపులు, మీటింగ్ హాల్, టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని, రైతులు (Farmers) పండించే ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
