Homeజిల్లాలునిజామాబాద్​MLA Dhanpal | మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే ధన్​పాల్​

MLA Dhanpal | మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే ధన్​పాల్​

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (PM Narendra Modi Birthday) సందర్భంగా సేవాపక్షంలో భాగంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో మాణిక్ భవన్ పాఠశాలలో పుస్తకాల పంపిణీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలలో మౌలిక సౌకర్యాలతో పాటు అన్ని వసతులు ఏర్పాటుకు సహకరిస్తానన్నారు. వినయం, విధేయత, విద్యకు మారుపేరుగా మాణిక్ భవన్ పాఠశాల (Manik Bhavan School) నిలవాలని సూచించారు.

ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని తెలిపారు. ఆడపిల్లలకు అండగా ఎన్నో పథకాలను తీసుకొచ్చారన్నారు. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్​తో (EWS reservation) విద్య, ఉపాధిలో అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు ధన్​పాల్​ శ్రీనివాస్, పాఠశాల అధ్యక్షుడు ఇంగు శివ ప్రసాద్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News