అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : District Court | జిల్లాలో న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ సీనియర్ న్యాయవాది జయకుమార్ (Senior Advocate Jayakumar) అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ (Telangana Bar Council) మెంబర్ నిమిత్తం జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా గురువారం జిల్లా కోర్టులో ప్రచారం నిర్వహించారు.
District Court | బార్ అసోసియేన్ సభ్యులను..
ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ (Bar Association) సభ్యులను కలుస్తూ తనకు తెలంగాణ బార్ కౌన్సిల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎన్నుకోవాలని కోరారు. అడ్వకేట్ల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు పాత్రను పోషిస్తానని ఈ సందర్భంగా జయకుమార్ హామీ ఇచ్చారు. జయకుమార్ ఇదివరకు హైకోర్టులో న్యాయవాదిగా, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు.