అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CBI Raids | లంచం తీసుకుంటూ పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (PWD EE) సీబీఐ అధికారులకు (CBI Officers) చిక్కాడు. ఢిల్లీ (Delhi)లోని రౌస్ అవెన్యూ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లోని జ్యుడీషియరీ సివిల్ డివిజన్-2, పిడబ్ల్యుడి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సి) ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు. పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం తనకు 3 శాతం కమిషన్ చెల్లించాలన్నారు. లేదంటే బిల్లులు రావని బెదిరించాడు. దీంతో బాధితుడు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రూ.30 వేలు తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
CBI Raids | రూ.1.60 కోట్ల నగదు స్వాధీనం
నిందితుడిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడికి సంబంధించిన ఢిల్లీ, జైపూర్ (Jaipur)లోని ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.1.60 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా పలు ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆస్తులను చూసి సీబీఐ అధికారులే షాక్ అయ్యారు.