అక్షరటుడే, బోధన్: Local Body Elections | సాలూర మండలంలోని (Saloora mandal) జాడి జమాల్పూర్ గ్రామంలో ఉన్నత విద్యనభ్యసించిన ఓ యువతి సర్పంచ్ బరిలో నిలిచారు. ఓ ప్రధాన పార్టీ మద్దతుతో ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు.
జాడిజమాల్పూర్ గ్రామంలో (Jadi Jamalpur village) పుట్టి పెరిగిన నిహారిక బీఎస్సీ అగ్రికల్చర్ చేశారు. అనంతరం హైదరాబాద్లో ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నారు. గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆమె సర్పంచ్ బరిలో దిగారు. ఈ సందర్భంగా గురువారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. తనకు అవకాశం కల్పిస్తే గ్రామానికి సేవ చేస్తానని.. అభివృద్ధి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
