అక్షరటుడే, ఇందూరు: Giriraj Degree College | సమాజాన్ని ఉన్నతీకరించడంలో విద్యదే కీలక పాత్ర అని ఉన్నత విద్యా మండలి(Council of Higher Education) ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఈపీ ఆధారంగా విద్యలో గుణాత్మక మార్పుల కోసమే డిగ్రీ, పీజీ పాఠ్య ప్రణాళికల మార్పులు చేపడుతున్నామన్నారు.
Giriraj Degree College | ఉత్తమమైన బోధన అందించాలి..
రీసెర్చ్ అవార్డ్స్ లెర్నింగ్ మెటీరియల్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ తదితర అంశాలను రూపొందించి వెబ్సైట్లో పొందుపర్చామని ఛైర్మన్ తెలిపారు. అధ్యాపకులు మరింత కృషిచేసి విద్యార్థులకు ఉత్తమమైన బోధన అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగరత్నం, పీఆర్వో దండు స్వామి, ఎన్సీసీ(NCC) లెఫ్ట్నెంట్ రామస్వామి, అధ్యాపకులు రంజిత, వినయ్, ముత్తెన్న, చంద్రశేఖర్, రామకృష్ణ, జయ ప్రసాద్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
