ePaper
More
    Homeఅంతర్జాతీయంRobert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) (Enforcement Directorate – ED) సమన్లు జారీ చేసింది. యూకే ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారీ(UK arms consultant Sanjay Bhandari)కి సంబంధించిన కేసులో రాబర్ట్ వాగ్మూలాన్ని రికార్డ్ చేయడానికే ఈ సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

    Robert Vadra : జూన్​​ 17న విచారణ

    సంజయ్​ భండారీ అక్రమ నగదు చలామణి (మనీ లాండరింగ్) కేసులో తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి జూన్​ 17న ఈడీ ఎదుట రాబర్ట్ వాద్రా హాజరుకావాలని కోరినట్లు అధికారులు వెల్లడించారు.

    Robert Vadra : అనారోగ్య సమస్యలు

    జూన్​ 10నే ఈడీ విచారణకు వాద్రా హాజరు కావాల్సి ఉంది. కానీ, 56 ఏళ్ల వాద్రా తనకు జూన్​ 9న ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయని, ప్రొటోకాల్ ప్రకారం కొవిడ్ పరీక్ష చేయించుకున్నానని చెప్పి, విచారణకు డుమ్మా కొట్టారు.

    అయితే, ఈడీ సమన్లను తప్పించుకునే ఉద్దేశం వాద్రాకు లేదని, ఈ నెల చివరలో తన విదేశీ ప్రయాణానికి ముందుగానీ, తర్వాత ఎప్పుడైనా ఈడీ ఎదుట హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు రాబర్ట్ తరఫు న్యాయవాది అప్పట్లో వివరణ ఇచ్చారు.

    అయితే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్​ (పీఎంఎల్​ఏ) కింద వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి, తర్వాత ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి వాద్రాకు ఈడీ తాజా సమన్లు​ జారీ చేసినట్లు చెబుతున్నారు.

    Robert Vadra : మొత్తం 3 కేసులున్నాయ్​!

    మూడు మనీ లాండరింగ్ కేసుల్లో వాద్రాను ఈడీ విచారణ చేపడుతోంది.

    • 2008లో హరియాణా(Haryana)లో జరిగిన ఓ భూ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంగా వాద్రాను ఈడీ మూడు రోజులపాటు ప్రశ్నించింది.
    • రాజస్థాన్(Rajasthan) బికనీర్(Bikaner)​లో జరిగిన ఓ భూ ఒప్పందంలో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఈ మనీలాండరింగ్ కేసులోనూ వాద్రాపై ఈడీ దర్యాప్తు చేపడుతోంది.
    • ఢిల్లీ(Delhi)లో 2016లో సంజయ్​ భండారీ(63)పై ఆదాయపు పన్ను శాఖ రైడింగ్ చేపట్టింది. ఈ ఘటన జరిగిన వెంటనే అతడు లండన్ పారిపోయాడు. అతడిని భారత్​కు తిరిగి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల బ్రిటన్ సుప్రీంకోర్టులో భారత్ ప్రభుత్వం అప్పీల్ చేసింది. కానీ, దానిని యూకే కోర్టు తిరస్కరించింది. దీంతో భండారీని మన దేశానికి తీసుకొచ్చే అవకాశాలు లేకుండా పోయాయి.

    2009లో లండన్​(London)లో 12, బ్రయాన్​స్టన్​ స్క్వేర్​ ఇంటిని భండారీ కొనుగోలు చేశాడు. దానిని రెనోవేషన్ చేయమని కోరుతూ వాద్రా డబ్బులు ఇచ్చినట్లు ఈడీ 2023లో ఛార్జ్ షీట్​ దాఖలు చేసింది. అయితే, తనకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ లండన్​లో ఎలాంటి ఆస్తులు లేవని రాబర్ట్ వాదిస్తున్నారు. ‘రాజకీయ కక్ష’లతోనే తనపై ఈడీ కేసులు పెట్టి ‘వెంటాడి, వేధిస్తున్నారు’ అని పేర్కొంటున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...