ED raids | హైదరాబాద్ పాతబస్తీలో ఈడీ దాడులు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ED raids | తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భూదాన్‌ భూముల వ్యవహారంలో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. పలువురు ఇళ్లలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో భూదాన్‌ (Bhoodan lands), మహేశ్వరం భూముల వ్యవహారంలో తాజాగా ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు సమాచారం. భూదాన్‌ భూములను అక్రమంగా ఆక్రమించి లే-అవుట్‌ చేసి మునావర్‌ ఖాన్‌, ఖదీర్‌ ఉన్నిసా అనే వ్యక్తులు అమ్మకాలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ED raids | తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భూదాన్‌ భూముల వ్యవహారంలో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. పలువురు ఇళ్లలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి.

తెలంగాణలో భూదాన్‌ (Bhoodan lands), మహేశ్వరం భూముల వ్యవహారంలో తాజాగా ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు సమాచారం. భూదాన్‌ భూములను అక్రమంగా ఆక్రమించి లే-అవుట్‌ చేసి మునావర్‌ ఖాన్‌, ఖదీర్‌ ఉన్నిసా అనే వ్యక్తులు అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు వంద ఎకరాల భూములను విక్రయించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు పాతబస్తీలో మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసాలతో పాటు శర్పాన్‌, సుకుర్ అనే వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్‌ అమాయ్‌ కుమార్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...