ED raids| జెన్సాల్ ఇంజినీరింగ్ లో ఈడీ దాడులు.. ప్రమోటర్ పునీత్​సింగ్​ జగ్గీని అదుపులోకి తీసుకున్న ఈడీ

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది. అలాగే, ఢిల్లీలోని ఒక హోటల్లో దాక్కున్న కో-ప్రమోటర్ పునీత్ సింగ్ జగ్గీని అదుపులోకి తీసుకుంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల కింద ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్లోని కంపెనీ ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. ప్రమోటర్ అన్మోల్ జగ్గీ దుబాయ్లో ఉండగా, ఢిల్లీ హోటల్లో ఉన్న సహా ప్రమోటర్ పునీత్ జగ్గీని ఈడీ అధికారులు అదుపులోకి […]

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది. అలాగే, ఢిల్లీలోని ఒక హోటల్లో దాక్కున్న కో-ప్రమోటర్ పునీత్ సింగ్ జగ్గీని అదుపులోకి తీసుకుంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల కింద ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్లోని కంపెనీ ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. ప్రమోటర్ అన్మోల్ జగ్గీ దుబాయ్లో ఉండగా, ఢిల్లీ హోటల్లో ఉన్న సహా ప్రమోటర్ పునీత్ జగ్గీని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సేకరించిన ప్రమోటర్లు వాటిని మళ్లించి జల్సాలకు వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ విచారణ చేపట్టగా, అనేక అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రమోటర్ సోదరులు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘా ఉంచింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈపీసీ కాంట్రాక్టుల సేకరణ కోసం జెన్సోల్ ఇంజనీరింగ్.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇరెడా లిమిటెడ్ నుంచి రుణాలు పొందింది. అయితే, ఈ నిధులను ప్రమోటర్లు, వారి బంధువుల వ్యక్తిగత పేరుతో లేదా గ్రూప్ స్థాపించిన వివిధ షెల్ సంస్థలలో ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ప్రయోజనాల కోసం ఈ నిధులను ఉపయోగించకుండా మళ్లించింది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా దాడులు నిర్వహించింది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...