Homeలైఫ్​స్టైల్​Rusks | రస్క్‌లు తింటున్నారా? జాగ్రత్త.. ఈ ప్రమాదాలు తప్పవు!

Rusks | రస్క్‌లు తింటున్నారా? జాగ్రత్త.. ఈ ప్రమాదాలు తప్పవు!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్ : Rusks | ఉదయం టీతో పాటు రస్క్‌లు తినడం మనలో చాలామందికి ఒక అలవాటు. తేలికైన, క్రిస్పీగా ఉండే ఈ స్నాక్‌ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని చాలామందికి తెలియదు. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రస్క్‌లను మైదా పిండి (Maida Flour), చక్కెర (Suger), నూనె, యీస్ట్‌ (Yeast) వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఈ తయారీ క్రమంలో వాటిలోని పోషకాలు చాలావరకు పోతాయి. ముఖ్యంగా, వీటిలో ఫైబర్, విటమిన్లు, మరియు మినరల్స్ దాదాపు ఉండవు. అందుకే, రోజూ రస్క్‌లు తినడం వల్ల మనకు కలిగే అనారోగ్య సమస్యలు ఇప్పుడు చూద్దాం.

Rusks | ఆరోగ్య సమస్యలు..

రక్తంలో చక్కెర పెరుగుదల: రస్క్‌లు మైదాతో తయారవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి. ఇది మధుమేహం ఉన్నవారికి, లేనివారికి కూడా ప్రమాదకరమే.

బరువు పెరుగుదల: రస్క్‌లలో (Rusks Side Effects) ఉండే అధిక చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ బరువు పెరగడానికి, రక్తపోటు పెరగడానికి, గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణమవుతాయి.

జీర్ణ సమస్యలు: ఇందులో ఫైబర్ లేకపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది.

అధిక ఆకలి: రస్క్‌లలో ప్రొటీన్ ఉండదు కాబట్టి, ఇవి త్వరగా జీర్ణమై ఆకలిని పెంచుతాయి. దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకుని బరువు పెరుగుతాం.

ప్యాంక్రియాస్​పై ఒత్తిడి: రస్క్‌లు తరచుగా తినడం వల్ల ప్యాంక్రియాస్ ఎక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు (Insulin Resistance), మధుమేహానికి దారితీస్తుంది.

ఈ సమస్యలను నివారించడానికి, రస్క్‌లకు బదులుగా మల్టీగ్రెయిన్ బిస్కెట్లు, మొలకెత్తిన గింజలు, లేదా పండ్ల వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మంచిది. మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.