అక్షరటుడే, వెబ్డెస్క్: Vikarabad | వికారాబాద్ జిల్లాలో గురువారం సాయంత్ర స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పూడూరు మండలం (Pudur mandal) రాకంచెర్ల గ్రామంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఒక్కసారిగా భూమి కంపించడంతో (earthquake) ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం సమయంలో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లోని సామగ్రి కదిలినట్లు పేర్కొన్నారు. దీంతో ఇళ్లనుంచి బయటకు వచ్చామన్నారు. అనంతరం చాలా సేపటి వరకు భయంతో బయటే ఉండిపోయినట్లు వారు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
Vikarabad | పరిశీలించిన అధికారులు
సమాచారం అందుకున్న అధికారులు గ్రామానికి చేరుకున్నారు. తహసీల్దార్, పోలీసులు రాకంచెర్లకు (Rakancherla) చేరుకొని వివరాలు సేకరించారు. అయితే భూ ప్రకంపనలు గల కారణాలపై జియోలాజికల్ సర్వే అధికారులు (Geological Survey officials) అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. కాగా రెండు నెలల క్రితం పరిగి మండలంలోని పలు గ్రామాల్లో ఇదే విధంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.