Earthquake | ఏపీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏపీలోని ప్రకాశం (Prakasham) జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఏపీలోని ప్రకాశం (Prakasham) జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake | 3.4 తీవ్రతతో..

ఒంగోలు (Ongole) పట్టణంలోని విజయ్ నగర్ కాలనీ, వడ్డేపాలెం, గాయత్రీ నగర్, భాగ్యనగర్, శ్రీరామపురం, సీఎస్ఆర్ శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. రిక్టార్​ స్కేల్​పై 3.4 తీవ్రతతో భూకంపం చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

Earthquake | గతంలో సైతం..

గతంలో సైతం ప్రకాశం జిల్లాలో భూకంపం చోటు చేసుకుంది. మే నెలలో భూ ప్రకంపనలు సంభవించాయి. పొదిలి, దర్శి, మండ్లమూరు మండలాల్లో అప్పుడు భూమి కంపించింది. దర్శి నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్​లో నాలుగు రోజుల పాటు వరుసగా భూమి కంపించింది.

Related articles

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

Kharge Jaggareddy Meeting | ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి.. రాజ్యసభ సభ్యులపై వినతి

కాంగ్రెస్​ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్​రావు, జెట్టి కుసుమకుమర్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.