అక్షరటుడే, వెబ్డెస్క్ : Earthquake | రాష్ట్రంలోని ప్రాంతాల్లో earthquake in Telangana భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం కరీంనగర్, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి, కోరుట్ల, నిర్మల్ జిల్లాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆసిఫాబాద్ సమీపంలో 3.8 తీవ్రతతో పది కిలో మీటర్ల లోతులో భూమి కంపించినట్లు సమాచారం.
