అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eagle Team | హైదరాబాద్ నగరంలో (Hyderabad city) డ్రగ్స్, గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఎంతోమంది యువత వీటికి బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
నగరంలో డ్రగ్స్ నిర్మూలణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈగల్ టీమ్‌ను (Eagle Team) ఏర్పాటు చేసింది. ఈగల్ టీం, ఎస్వోటీ పోలీసులు నిత్యం దాడులు చేపడుతూ గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినా దందా ఆగడం లేదు. ఈ క్రమంలో ఈ నెట్‌వర్క్‌ను ఛేదించడాని తెలంగాణ ఈగల్ టీమ్ పోలీసులు (Telangana Eagle Team police) భారీ ఆపరేషన్ చేపట్టారు. ఢిల్లీ, నోయిడా, వైజాగ్, గుర్గావ్, గ్వాలియర్‌లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 50 మంది నైజీరియన్లను పట్టుకున్నారు. నైజీరియన్స్ ఉంటున్న కాలనీలు గుర్తించి సోదాలు నిర్వహించారు.
Eagle Team | అక్రమంగా ఉంటూ..
దేశంలోని పలు ప్రాంతాల్లో నైజీరియన్లు నివసిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సైతం పెద్ద సంఖ్యలో వీరు ఉంటారు. అయితే చాలా మంది అక్రమంగా నివసిస్తున్నారు. వీరు డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల్లో (cyber crimes) భాగస్వామ్యం అవుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో ఈగల్ టీమ్ పోలీసులు ఢిల్లీ పోలీసుల సాయంతో ఏకకాలంలో దాడులు చేపట్టారు. 50 మంది నైజీరియన్లను అరెస్ట్ చేశారు. వీరంతా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో వంద మంది ఢిల్లీ పోలీసులు, 124 మంది ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 20 ప్రాంత్లాలో సోదాలు చేపట్టారు. డ్రగ్ కింగ్‌పిన్, డ్రగ్ సేల్ గర్ల్స్, సెక్స్ వర్కర్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్లను అరెస్ట్ చేశారు. భారీగా మత్తు పదార్థాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
