అక్షరటుడే, వెబ్డెస్క్: E-Dip registration | తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ (E-Dip registration) ముగిసింది. రిజిస్ట్రేషన్లను ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ప్రారంభించగా.. నేడు సాయంత్రం 5 గంటలకు పూర్తియింది. ఇందులో భాగంగా మొత్తం 1.8 లక్షల టోకన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా.. మంగళవారం ఈ–డిప్ నిర్వహించి టోకెన్లు అందజేయనున్నారు.
E-Dip registration | డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం
ఈ–డిప్ రిజిస్ట్రేషన్లలో టోకెన్లు వచ్చిన భక్తులకు మూడు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshan) కల్పించనున్నారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో దర్శన అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24, 05,237లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ (TTD mobile app) ద్వారా 13.4 లక్షల మంది భక్తులు, టీటీడీ వెబ్ సైట్లో 9.3లక్షలు, ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ (AP Government WhatsApp) ద్వారా 1.5 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం యథాతథంగా కొనసాగనుంది.
E-Dip registration | డిసెంబర్ 5న ఆన్లైన్ దర్శనం టికెట్లు విడుదల
జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు 7 రోజులకు సంబంధించి 300 దర్శనం టికెట్లు, రోజుకు వెయ్యి శ్రీవాణి టికెట్లు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 5వ తేదీన ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. చివరి మూడు రోజులు జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికుల కోసం రోజుకు 5వేల టోకన్లు ఇవ్వనున్నారు. వీటిని డిసెంబర్ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు.
