Homeజిల్లాలుకామారెడ్డిDussehra | దసరా వచ్చింది.. మార్కెట్లలో సందడి తెచ్చింది..

Dussehra | దసరా వచ్చింది.. మార్కెట్లలో సందడి తెచ్చింది..

అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Dussehra | దసరా వచ్చిందంటే చాలు.. చాలామంది కొత్త వాహనాలు, ఎలక్ట్రానిక్​ వస్తువులు (Electronic goods) కొనుగోలు చేస్తుంటారు. విజయదశమికి (Vijayadashami) కొత్త వస్తువులు కొంటే మంచిదని ప్రజలు భావిస్తారు.

వాహనాలు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు కొంటుంటారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని షాపింగ్​ మాల్స్​, షోరూంలలో సందడి నెలకొంది. ఏ దుకాణం చూసినా ప్రజలతో కిటకిటలాడుతోంది.

Dussehra | జీఎస్టీ తగ్గుదలతో..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ(GST) స్లాబ్​లను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గాయి. జీఎస్టీ తగ్గింపు పండుగ షాపింగ్​ చేస్తున్న ప్రజలకు కలిసొచ్చింది. దాంతో జిల్లావ్యాప్తంగా పండుగ శోభ కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పలు షోరూంలు జనాలతో కిటకిటలాడుతున్నాయి.

కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కార్లు, బైక్​ల రేట్లు భారీగా తగ్గడంతో ప్రజలకు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో పలు షోరూంల్లో ఇప్పటికే కార్లు బుక్ చేసుకున్నారు. గురువారం విజయదశమి సందర్భంగా కార్లను తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Dussehra | ప్రత్యేక ఆఫర్లు

వాహనాల కొనుగోలుపై షోరూం​ నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే జీఎస్టీతో ధరలు తగ్గడంతో పాటు ఆఫర్లు ఉండడంతో ప్రజలు ఆయా వస్తువులను ఇళ్లకు తెచ్చుకుంటున్నారు. ఒక్కో బైక్​పై రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ధరలు తగ్గాయి. దాంతో బైక్​లు, స్కూటీలు కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులైన ఫ్రిడ్జ్​, వాషింగ్ మిషన్(Washing machine), ఏసీ, ఇతర వస్తువుల ధరలు కూడా తగ్గడంతో ప్రజలు పండుగ పూట కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. ఆఫర్లతో పాటు పలు మాల్స్​లో ప్రత్యేక బహుమతులను ఇచ్చి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.

Dussehra | షాపింగ్​ మాల్స్​లో..

Dussehra

పండుగ సందర్భంగా షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. కొత్తదుస్తులు కొనుక్కునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో కామారెడ్డి, నిజామాబాద్​కు తరలి వస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లో భారీగా రద్దీ నెలకొంది. మరోవైపు రేపే దసరా కావడంతో ప్రజలు పూలు, గుమ్మడికాయలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పూల ధరలు భారీగా పెరిగాయి. దసరా పండగ నేపథ్యంలో కామారెడ్డి మార్కెట్ జనాలతో రద్దీగా మారింది.

నిజామాబాద్​ నగరంలో గుమ్మడికాయలు కొనుగోలు చేస్తున్నప్రజలు

నిజామాబాద్​ నగరంలో పూజాసామగ్రి కొనుగోలు చేస్తున్న ప్రజలు

కామారెడ్డిలో బైక్​ షోరూంలో సందడి..