అక్షరటుడే, హైదరాబాద్: liquor sales | తెలంగాణలో దసరా అంటే దావత్ ఉండాల్సిందే.. ఓ వైపు అమ్మవారి నవరాత్రి Navratri celebrations వేడుకలు కొనసాగుతూనే ఉంటాయి. మరో వైపు అనాదిగా వస్తున్న ఆచారాల్లో తేడా రాదు.
మానాయి(మహా నవమి)(మహార్ణవమి) సందర్భంగా ఆయుధ పూజ, వాహన పూజ చేస్తుంటారు. ఈ సందర్భంగా శక్తి బలి ఉంటుంది. ఈ క్రమంలో దావత్కు కొదవ ఉండదు. మద్యం ఏరులై పారుతుంది.
ఈసారి దసరా దావత్ మస్త్గా సాగింది. మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రూ. 800 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
దసరా పండుగ అక్టోబరు 2న రావడం, ఆరోజు గాంధా జయంతి Gandhi Jayanti సందర్భంగా వైన్స్ లకు సెలవు ఉన్న నేపథ్యంలో ముందే మద్యం కొనుగోళ్లు జరిగి, ఆబ్కారీ శాఖకు కాసుల వర్షం కురిసింది.
గాంధీ జయంతి నేపథ్యంలో దసరా రోజు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలిసి, ముందే విక్రయాల జోరు కొనసాగింది. గతేడాదితో పోల్చితే ఈసారి 60 శాతం ఎక్కవగా మద్యం అమ్ముడైంది. ఈసారి మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
- సెప్టెంబరు 28 : రూ. 200 కోట్లు
- సెప్టెంబరు 29: రూ. 278 కోట్లు
- సెప్టెంబరు 30: రూ. 333 కోట్లు
- అక్టోబరు 1 : రూ. 86.23 కోట్లు
గతేడాదితో పోలిస్తే ఈ మూడు రోజుల్లోనే 60 నుంచి 80 శాతం వరకు అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
ఒక్క సెప్టెంబరు నెల గణాంకాలు పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా రూ. 3,048 కోట్ల మద్యం వ్యాపారం సాగడం గమనార్హం. ఈ సంవత్సరం ఇప్పటివరకు లెక్కలు తీసుకుంటే 36.46 లక్షల కేసుల బీర్లు, 29.92 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడుపోయింది.
liquor sales | స్థానిక సమరమే కారణమా..
స్థానిక సంస్థల ఎన్నికల local body elections షెడ్యూల్ విడుదలైంది. పల్లెల్లో ఆశావహులు తమ అనుచరగణం, ఓటర్లను వలలో వేసుకునే పనిని అప్పుడే మొదలెట్టారు. దసరా కలిసి రావడంతో పండుగ దావత్ మొదలెట్టారు.
ఈ నేపథ్యంలోనే మద్యం విక్రయాలు ఎక్కువగా సాగినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈసారి పండుగకు ముందే వేతన జీవుల సాలరీలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో మద్యం ప్రియుళ్లు కొనుగోళ్లకు మొగ్గు చూపినట్లు స్పష్టం అవుతోంది.