HomeజాతీయంDussehra | దసరా, గాంధీ జయంతి ఒకేరోజు.. మాంసం, మద్యం దుకాణాలు బంద్

Dussehra | దసరా, గాంధీ జయంతి ఒకేరోజు.. మాంసం, మద్యం దుకాణాలు బంద్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dussehra | తెలంగాణలో దసరా పండుగ(Dussehra Festival)ను ఘనంగా జరుపుకుంటారు. కొన్ని వర్గాలు మినహాయిస్తే దాదాపు అందరూ ఆ రోజు మాంసం వండుకుంటారు. అయితే ఈ ఏడాది దసరా, గాంధీ జయంతి(Gandhi Jayanti) ఒకే రోజు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు బంద్​ ఉంటాయి. దీంతో తెలంగాణ(Telangana) వాసులు కలవర పడుతున్నారు. రెండు ఒకే రోజు రావడంతో ఎలా అని ఆలోచిస్తున్నారు. మాంసం, మద్యం లేకుండా పండుగ ఎలా జరుపుకోవాలని చర్చించుకుంటున్నారు.

Dussehra | జీహెచ్​ఎంసీ ఆదేశాలు

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్​ఎంసీ అధికారులు(GHMC Officers) ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాంసం ప్రియులు నిరాశ చెందుతున్నారు. అన్ని రకాల మాంసం షాపులను మూసివేయాలని, ఇందుకు సంబంధింత సిబ్బంది పర్యవేక్షించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పండుగ ఎలా జరుపుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు.

Dussehra | మద్యం దుకాణాలు సైతం..

అక్టోబర్​ 2న ఎలాగు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే మద్యం ప్రియులు కావాలనుకుంటే ముందు రోజు కొనుగోలు చేసి పెట్టుకుంటారు. కానీ మాంసంపైనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జీహెచ్​ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు బంద్​ చేయాలని ఆదేశాలు వచ్చాయి. మిగతా జిల్లాల్లో సైతం ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పండుగ పూట మాంసం ఎలా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. దసరా రోజు మాంసం దుకాణాలకు భారీగా గిరాకీ వస్తుంది. దీంతో ఆ రోజు దుకాణాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.