అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు నిత్యం డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు (Drunk driving checks) చేపడుతున్నారు. వీకెండ్లో స్పెషల్ తనిఖీలు చేపట్టి మందుబాబుల ఆట కట్టిస్తున్నారు.
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 5, 6 తేదీల్లో నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు మొత్తం 474 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.
Hyderabad | వారే అధికం..
మద్యం తాగి దొరుకుతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే అధికంగా ఉంటున్నారు. తాజాగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 381 మంది బైకర్లు చిక్కారు. త్రిచక్ర వాహనాల డ్రైవర్లు 26 మంది, ఇతరులు 67 మంది పట్టుబడ్డారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) మద్యం తాగి వాహనాలు నడపడాన్ని ఉపేక్షించడం లేదు. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు.
నగరంలో పోలీసులు ఇటీవల ఆపరేషన్ కవచ్ (Operation Kavach) నిర్వహించారు. దాదాపు 5 వేల పోలీసు సిబ్బంది 150 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అనేక వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేశారు. రాత్రిపూట అనవసరంగా తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. సీపీ సజ్జనార్ సైతం తనిఖీల్లో పాల్గొన్నారు.