అక్షరటుడే, వెబ్‌డెస్క్: drone sighting in Jammu Kashmir | జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్ల కదలికలు మళ్లీ కలకలం రేపాయి. నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లు తిరగడాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. రాజౌరి జిల్లా కేరి సెక్టార్, దూంగా గాలి ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్లు తిరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాక్ డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాలను తరలించే అవకాశం ఉన్నందున భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.
drone sighting in Jammu Kashmir | సెర్చ్ ఆపరేషన్..
డ్రోన్ల సంచారాన్ని గమనించిన మన భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. వాటిని కూల్చివేసే క్రమంలో కాల్పులు జరిపాయి. డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు కానీ, నిషేధిత వస్తువులను ఏమైనా పంపించారా అని తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలో మన సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అడవి ప్రాంతం అవడంతో డ్రోన్ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, రాజౌరి సెక్టార్‌లో గత 48 గంటల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.