అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 : భారత సైనిక సామర్థ్యాలకు గణనీయమైన ముందడుగు పడుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ Defence Research and Development Organisation (DRDO) 7,500 కేజీల భారీ సంప్రదాయ బంకర్-బస్టర్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లడానికి రూపొందించిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి Agni-5 ballistic missile కొత్త వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది.
పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు, ముప్పుల మధ్య భారత్ తన సంప్రదాయ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనికి ఈ కొత్త ప్రాజెక్టుతో వ్యూహాత్మక అడుగు పడబోతోంది.
జూన్ 22న ఇరాన్ IRAN లోని ఫోర్డో Fordow అణు కేంద్రం లక్ష్యంగా యునైటెడ్ స్టేట్స్ GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP)ని మోహరించింది. దీని నుంచి ప్రేరణ పొంది అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి కొత్త వేరియంట్‌ను అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది.
Agni-5 : భూమి లోపలకు చొచ్చుకుని పోయి..
అగ్ని-5 రెండు కొత్త వేరియంట్‌లను డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఎయిర్ బస్టర్ వేరియంట్ భూమిపై లక్ష్యాల కోసం రూపొందించబడింది. ఇది విస్తృత ప్రాంతంలో విధ్వంసం చేస్తుంది. ఇక బంకర్-బస్టర్ వేరియంట్ పేలుడుకు ముందు 100 మీటర్ల భూగర్భంలోకి చొచ్చుకుపోయేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త మోడల్‌లు GBU-57 వంటి US ఆయుధాల సామర్థ్యాలకు సరిపోయేలా, వాటిని అధిగమించే పేలోడ్‌లను మోసుకెళ్తాయని అధికారిక వర్గాలు నివేదిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో శత్రు స్థానాలను లక్ష్యంగా చేసుకోవడానికి భారత్‌కు అత్యాధునిక పరిష్కారంగా వీటిని పేర్కొంటున్నారు.
Agni-5 : దూరం విషయంలో…
5,000 కి.మీ కంటే ఎక్కువ ఖండాంతర పరిధిని కలిగి ఉన్న అగ్ని-5 లా కాకుండా.. కొత్త వేరియంట్‌లు సుమారు 2,500 కి.మీల తక్కువ పరిధిని కలిగి ఉంటాయి. కానీ, ఇవి చాలా పెద్ద వార్‌హెడ్‌లను మోసుకెళ్తాయి. వీటి ద్వారా చైనా, పాకిస్తాన్‌తో సహా పొరుగు దేశాలలో.. ముఖ్యంగా పర్వత, దుర్భేద్యమైన భూభాగంలోని సైనిక స్థావరాలపై కచ్చితమైన విధ్వంసకర దాడులకు దిగొచ్చని చెబుతున్నారు.
హైపర్సోనిక్ Hypersonic వేగం ఈ కొత్త అగ్ని-5 వెర్షన్‌ల అద్భుతమైన లక్షణాలలో ఒకటి. ఇవి అగ్రశ్రేణి అమెరికన్ వ్యవస్థల మాదిరిగానే మాక్ 8 నుంచి మాక్ 20 వరకు చేరుకునే అవకాశం ఉంది.