liquor shops | కామారెడ్డిలో మద్యం దుకాణాల రిజర్వేషన్లకు డ్రా

అక్షరటుడే, కామారెడ్డి: liquor shops | తెలంగాణ నూతన మద్యం పాలసీలో (new liquor policy) భాగంగా జిల్లాలో 49 మద్యం దుకాణాల రిజర్వేషన్లకు లక్కీడ్రా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, గౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కోసం గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్​లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు. జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 5 ఎస్సీ సామాజిక వర్గానికి, […]

అక్షరటుడే, కామారెడ్డి: liquor shops | తెలంగాణ నూతన మద్యం పాలసీలో (new liquor policy) భాగంగా జిల్లాలో 49 మద్యం దుకాణాల రిజర్వేషన్లకు లక్కీడ్రా నిర్వహించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, గౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కోసం గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్​లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు. జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 5 ఎస్సీ సామాజిక వర్గానికి, 2 ఎస్టీ సామాజిక వర్గానికి, 7 బీసీ గౌడ కులస్థులకు లాటరీ ద్వారా మద్యం షాప్​లను ఎంపిక చేశారు.

వీటి ఆమోదానికి రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ (Excise Department) కమిషనర్​కు పంపిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి వెంకటేష్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, జిల్లా ఎస్టీ అభివృద్ధి అధికారి సతీష్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...