అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ను డాక్టర్ రాజారెడ్డి (Dr. Raja Reddy) హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో కలిసి ఆయన శుక్రవారం మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. గతంలో కామారెడ్డి జిల్లా (Kamareddy District) అధ్యక్ష పదవికోసం డాక్టర్ రాజారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన తనకు న్యాయం చేస్తామని మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నానని.. యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ అధ్యకుడిగా పనిచేశానన్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్‌లో పదేళ్లు పనిచేశానని.. ఎన్ని ఇబ్బందులున్నా పార్టీని వదిలిపెట్టి వెళ్లలేదన్నారు. తనకు పార్టీ పరంగా న్యాయం చేస్తామని మీనాక్షి నటరాజన్ హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.
