Homeజిల్లాలునిజామాబాద్​Double bedroom houses | అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి

Double bedroom houses | అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్‌: Double bedroom houses | అర్హులైనే పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం తహశీల్దార్‌ సత్య నారాయణకు వినతిపత్రం అందజేశారు. సబ్‌ డివిజన్‌ కార్యదర్శి కిషన్‌ మాట్లాడుతూ.. అంకాపూర్‌లో (Ankapur) 81మంది అర్హులను గుర్తించి, కొందరి పేర్లు తొలగించారని, వాటి స్థానంలో ఎమ్మెల్యే అనుచరుల పేర్లు చేర్చారని ఆరోపించారు.

పట్టణంలోని పోచమ్మగల్లీలో 150 మందికి ఇళ్లు మంజూరు కాగా..ఆ లిస్టును కూడా మార్చినట్లు పేర్కొన్నారు. అధికారులు సమగ్ర విచారణ చేపట్టి అర్హులకే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ నాయకులు ఎండీ నజీర్, రవి నిఖిల్, సాయమ్మ, స్వరూప, సాయిలు, రవి, నవీన్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News