HomeతెలంగాణCM Revanth Reddy | పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మందుకు ఓటు వేయొద్దు : సీఎం...

CM Revanth Reddy | పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మందుకు ఓటు వేయొద్దు : సీఎం రేవంత్​రెడ్డి

పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మందుకు ఆశపడి ఓటు వేయొద్దని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. మంచి వ్యక్తులు గ్రామ సర్పంచులుగా ఉండాలన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) డబ్బు, మందుకు ఆశపడి ఓటు వేయొద్దని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. మంచి వ్యక్తులు గ్రామ సర్పంచులుగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆయన కొత్తగూడెంలో పర్యటించారు.

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఏర్పాటు చేసిన డా.మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్​ పాలనపై విమర్శలు చేశారు. బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్​లు కేసీఆర్​ కుటుంబానికి కనక వర్షం కురిపించాయన్నారు. కేసీఆర్‌ హయాంలో ఖమ్మం జిల్లాకు న్యాయం జరగలేదన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్​కు కంచుకోట అన్నారు. తమ ప్రభుత్వం ఈ జిల్లా నుంచే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. శ్రీరాముడి సాక్షిగా ఖమ్మం (Khammam) జిల్లాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

CM Revanth Reddy | పాల్వంచలో ఉద్యమానికి పునాది

తెలంగాణ ఉద్య‌మానికి స్పూర్తినిచ్చిన ప్రాంతం కొత్త‌గూడెం అని సీఎం అన్నారు. 1969 తొలిదశ ఉద్యమానికి పునాదులు పడింది పాల్వంచలోనే అని గుర్తు చేశారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో నాన్‌ లోకల్ వ్యక్తుల్ని తీసుకోవడంతో పాల్వంచలో ఉద్యమం రాజుకుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమైన శాఖలన్ని జిల్లాకు చెందిన నాయకులు భట్టి, తుమ్మల, పొంగులేటి దగ్గరే ఉన్నాయని పేర్కొన్నారు. డా.మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని జిల్లాలో ఏర్పాటు చేయడంపై మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యూనివర్సిటీ దేశానికే తలమానికం అవుతుందన్నారు.

Must Read
Related News