Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | దళారులను నమ్మి మోసపోవద్దు

Indalwai | దళారులను నమ్మి మోసపోవద్దు

రైతులు ప్రభుత్వ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఆర్డీవో రాజేందర్​ పేర్కొన్నారు. ఇందల్వాయిలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

- Advertisement -

అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆర్డీవో రాజేందర్ (RDO Rajender) అన్నారు. ఇందల్వాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (paddy purchase center) సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని అధికారులకు సూచించారు.

ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.2389, బి గ్రేడ్ రకానికి రూ.2369 మద్దతు చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యం తేమశాతం 17 ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్య ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని రైతులకు (Farmers) సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆయన వెంట తహశీల్దార్ వెంకట్ రావు, సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మానిటరింగ్ అధికారి మయూరి, మాజీ చైర్మన్ గోపాల్, ఆర్.రె మోహన్, సొసైటీ సీఈవో శ్రీకాంత్, సొసైటీ డైరెక్టర్లు రైతులు ఉన్నారు.