Pahalgam terror attack | కశ్మీర్ వెళ్లొద్దు..తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ జారీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgam terror attack : భారత్​లోని అమెరికా american citizens india పౌరులకు ఆ దేశం అడ్వైజరీ జారీ చేసింది. జమ్మూకశ్మీర్​కు వెళ్లొద్దని సూచించింది. జమ్మూకాశ్మీర్​లోని పహల్గామ్​లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అమెరికా ఈ అడ్వైజరీ us advisory to citizens జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్​కు వెళ్లవద్దని అమెరికా బుధవారం తన పౌరులకు సూచించింది. “జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత Union Territory of Jammu […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgam terror attack : భారత్​లోని అమెరికా american citizens india పౌరులకు ఆ దేశం అడ్వైజరీ జారీ చేసింది. జమ్మూకశ్మీర్​కు వెళ్లొద్దని సూచించింది. జమ్మూకాశ్మీర్​లోని పహల్గామ్​లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అమెరికా ఈ అడ్వైజరీ us advisory to citizens జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్​కు వెళ్లవద్దని అమెరికా బుధవారం తన పౌరులకు సూచించింది.

“జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత Union Territory of Jammu and Kashmir ప్రాంతంలో ఉగ్రవాద దాడులు, హింసాత్మక పౌర అశాంతి సంభవించే అవకాశం ఉంది. ఈ రాష్ట్రానికి ప్రయాణించవద్దు(తూర్పు లడఖ్ ప్రాంతం eastern Ladakh region, దాని రాజధాని లేహ్ capital Leh సందర్శనలను మినహాయించి). ఈ ప్రాంతంలో హింస అప్పుడప్పుడు జరుగుతుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ వెంబడి హింసాత్మక ఘటనలు సర్వసాధారణం. ఇది కశ్మీర్ లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్​ల( Kashmir Valley, Srinagar, Gulmarg, Pahalgam) లో కూడా జరుగుతుంది. భారత ప్రభుత్వం విదేశీ పర్యాటకులను నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించడానికి అనుమతించదు” అని ఇండియాలోని యూఎస్ రాయబార కార్యాలయం పేర్కొంది.

Pahalgam terror attack : కశ్మీర్​ను వీడుతున్న పర్యాటకులు..

ఉగ్రదాడి తర్వాత పర్యాటకులు పెద్ద సంఖ్యలో కాశ్మీర్​ను వీడుతున్నారు. గంటల వ్యవధిలోనే వేలాది మంది తిరుగు ప్రయాణమయ్యారు. స్పైస్జెట్, ఎయిర్ ఇండియాతో సహా అనేక విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ప్రయాణ సలహాలు జారీ చేశాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పర్యాటకులు తిరిగి రావడానికి వీలుగా శ్రీనగర్ నుంచి విమానాల సంఖ్యను పెంచాలని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ విమానయాన సంస్థలను కోరింది. అంతేకాకుండా, శ్రీనగర్ విమాన టిక్కెట్ల రద్దు, రీషెడ్యూల్ రుసుములను రద్దు చేయడాన్ని పరిగణించాలని కూడా విమానయాన సంస్థలకు సూచించింది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...