అక్షరటుడే, ఇందూరు: Government advisor Shabbir Ali : పదవుల కోసం పాకులాడకుండా ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని కార్యకర్తలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హితబోధ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్ లో బుధవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కేశవేణు kesha venu nizamabad అధ్యక్షతన పార్టీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిలుగా మహమ్మద్ అలీ షబ్బీర్, పట్టణ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ మనాల మోహన్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, అలాంటి వారికి తప్పకుండా భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలని సూచించారు.