అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponguleti Srinivas Reddy | కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti ) ఆగ్రహం వ్యక్తం చేవారు. మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad district) మంగళవారం ఆయన పర్యటించారు.
రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తానంటూ కేటీఆర్ (KTR) ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పొంగులేటి అన్నారు. అగ్నిగుండం చేస్తే.. ప్రజలు వారిని అందులోకి నెట్టేస్తారన్నారు. తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టె పట్టుకుని యువతను రెచ్చగొట్టిన వారు చావలేదు కానీ..అమాయకపు వేలాది మంది పిల్లల్ని పొట్టనపెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను స్వార్థం కోసం మళ్లీ జిల్లాల పేరుమీద ఉద్యమాలు చేస్తాం.. అగ్నిగుండాలు చేస్తాం..సామాన్య ప్రజలను బలిచేస్తాం అంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Ponguleti Srinivas Reddy | కమిటీ వేస్తామంటే భయమేందుకు
బీఆర్ఎస్ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని మంత్రి అన్నారు. జిల్లాల పునర్విభజనపై కమిటీ వేస్తామంటే ఎందుకు భయ పడుతున్నారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్స్ అంటున్నారు కదా.. ఆ ఎలక్షన్లలో చూసుకుందామని సవాల్ చేశారు. పంచాయతీ స్థానాలకంటే ఎక్కువ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజనను తప్పకుండా సరిచేస్తమని ఆయన తెలిపారు.
Ponguleti Srinivas Reddy | అభివృద్ధి పనుల ప్రారంభం
మంత్రి పొంగులేటి సత్తుపల్లిలో సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్కు కర్రుకాల్చి వాత పెట్టినా.. గత పాలకులకు ఇంకా జ్ఞానోదయం కాలేదని ఎద్దేవా చేశారు. ఒళ్లంతా విషం నింపుకొని రోడ్ల మీద కారుకూతలు కూస్తున్న వారికి మున్సిపల్ ఎన్నికల్లో నాలుగోసారి వాత తప్పదన్నారు.