HomeతెలంగాణNarcotic police | కల్తీకల్లుకు బానిస కావొద్దు

Narcotic police | కల్తీకల్లుకు బానిస కావొద్దు

- Advertisement -

అక్షరటుడే, బోధన్: కల్తీ కల్లుకు బానిసలుగా మారి కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో నార్కోటిక్ శాఖ (Narcotic Department) ఆధ్వర్యంలో కల్తీకల్లుతో(Kalthi kallu) జరిగే దుష్ఫరిణామాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్​ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ కల్తీకల్లు కారణంగా వేల కుటుంబాలు నాశనమవుతున్నాయని, దీనికి దూరంగా ఉండాలని ఆయన అవగాహన కల్పించారు. ర్యాలీలో నార్కోటిక్ ఏసీపీ సుబ్బిరామిరెడ్డి, టౌన్ సీఐ వెంకటనారాయణ వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​

Narcotic police | ఆర్మూర్​లో అవగాహన ర్యాలీ..

ఆర్మూర్​లో ర్యాలీ నిర్వహిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు

అక్షరటుడే, ఆర్మూర్ : మండలంలోని చేపూర్​లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో బుధవారం ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాంటీ నార్కోటిక్ బ్యూరో పుష్యన్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.