Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: షబ్బీర్ అలీ

Shabbir Ali | అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: షబ్బీర్ అలీ

దేవునిపల్లికి చెందిన దర్శపు సుధాకర్ కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | గొర్లను మేపడానికి వెళ్లి వాగులో పడి మృతి చెందిన దేవునిపల్లి వాసి దర్శపు సుధాకర్ కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) పరామర్శించారు. జీజీహెచ్​లో పోస్టుమార్టం గది వద్ద బాధిత కుటుంబ సభ్యులను కలిసి షబ్బీర్ అలీ మాట్లాడారు.

రైలు ఢీకొన్న (train accident) ఘటనలో 90 గొర్లు మృతి చెందాయని, వాటిని కాపాడుకునే క్రమంలో తమ కొడుకు వాగులో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు షబ్బీర్ అలీకి వివరించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్య పడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.