అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump-Ronaldo AI Video | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్నారంటే… వినడానికి ఫన్నీగా ఉంది. కానీ ఈ ఊహను నిజం చేసినట్టు కనిపించే ఓ ఏఐ జనరేటెడ్ వీడియో (AI Generated Video) ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ వీడియోను ట్రంప్ (Donald Trump) స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గురువారం పోస్ట్ చేశారు. వీడియోలో ట్రంప్–రొనాల్డో ఇద్దరూ ఓవల్ ఆఫీసులో బంతితో హెడర్లు, డ్రిబ్లింగ్ చేస్తూ సరదాగా ఆడుతున్నట్లుగా చూపించారు.
Trump-Ronaldo AI Video | ట్రెండింగ్ వీడియో
ట్రంప్ ఈ వీడియోకు ఇచ్చిన క్యాప్షన్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.“రొనాల్డో ఒక గొప్ప వ్యక్తి. వైట్‌హౌస్ (White House)లో అతడిని కలవడం చాలా ఆనందంగా అనిపించింది. ఎంతో స్మార్ట్, కూల్ పర్సన్.” అని పేర్కొన్నారు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో రికార్డు రేంజ్‌లో వ్యూస్ వస్తున్నాయి. ఈ ఏఐ వీడియో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. ఇప్పటికే 3.4 కోట్ల వ్యూస్, 16 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.ఈ వీడియోకి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఏదో మీమ్ పేజీ అనుకున్నా… కానీ ఇది అమెరికా అధ్యక్షుడి అధికారిక అకౌంట్ అని తెలిసి షాక్ అయ్యా! అంటూ పలువురు సరదాగా రియాక్షన్స్ ఇస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గౌరవార్థం వైట్‌హౌస్‌లో జరిగిన విందుకు రొనాల్డో (Cristiano Ronaldo), తన కాబోయే భార్య జార్జినా రోడ్రిగ్జ్‌తో కలిసి పాల్గొన్నారు. అదే సందర్భంలో రొనాల్డో–ట్రంప్ ముఖాముఖి కలుసుకున్నారు. ఆ విందులో ట్రంప్ మాట్లాడుతూ .. తన చిన్న కుమారుడు బారన్, రొనాల్డోకు పెద్ద అభిమానినని, రొనాల్డోను కలిసిన తర్వాత తనపై బారన్‌కి గౌరవం ఇంకాస్త పెరిగిందని సరదాగా చెప్పిన విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఏఐ వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
