ePaper
More
    Homeఅంతర్జాతీయంDonald Trump | భారత్ మెరుపు దాడుల‌పై ట్రంప్ రియాక్ష‌న్ ఏంటి.. ఆయ‌న ఏమ‌ని అన్నారంటే..!

    Donald Trump | భారత్ మెరుపు దాడుల‌పై ట్రంప్ రియాక్ష‌న్ ఏంటి.. ఆయ‌న ఏమ‌ని అన్నారంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Donald Trump | చెప్పి మ‌రీ చేయ‌డం అంటే ఇదేనేమో.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో (Pakistan-occupied Kashmir) దాడి చేసే ముందు.. ఇండియన్ ఆర్మీ (indian army) ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ (video post) చేసింది. ఆ వీడియో చూసినప్పుడు భారతీయుల (indians) రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. “దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గెలవడానికి ట్రైనింగ్ పొందాం” అని ఇండియన్ ఆర్మీ ఆ వీడియోని పోస్ట్ చేయ‌గా, అది తెగ వైర‌ల్ అయింది. అయితే ఈ వీడియో రిలీజ్ అయిన కొద్ది గంట‌ల‌లోనే పాక్ (pakistan) స్థావ‌రాల‌పై దాడులు చేశారు. దాదాపు వంద మందికి పైగా ఉగ్ర‌వాదులు (terrorists) ఈ దాడుల‌లో మ‌ర‌ణించిన‌ట్టు స‌మాచారం.

    Donald Trump | తొంద‌ర‌గా ముగించాలి..

    అయితే తాజా దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ఈ వార్ త్వరగానే ముగుస్తుంది అని తాను భావిస్తున్నాను అన్నారు. “నేను దీని గురించి ఇప్పుడే విన్నాను, ఓవల్ ఆఫీస్ డోర్ దాటుతున్నప్పుడు విన్నాను. భారత్, పాకిస్థాన్ (India and Pakistan) దేశాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. నేను ఇది త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నాను అంటూ ట్రంప్ అన్నారు. శ‌తాబ్ధాలుగా కొన‌సాగుతున్న భారత్-పాకిస్తాన్ (India and Pakistan) మధ్య ఉద్రిక్తతల్లో ఇది ఒక భాగం. ఇది విచారకరం. ఇది త్వరగా అంతం కావాలి అని ట్రంప్ అన్నారు. మ‌రోవైపు పాకిస్తాన్ కి (pakistan) అమెరికా (america) ఓ సూచ‌న చేసిన‌ట్టు తెలుస్తుంది. భార‌త్ పైకి యుద్ధానికి దిగొద్ద‌ని పేర్కొన్న‌ట్టు స‌మాచారం.

    ఇక ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ (United Nations Secretary-Genera) ఆంటోనియో గుటెర్రెస్ భారతదేశం-పాకిస్తాన్‌లను (India and Pakistan) సైనిక సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సరిహద్దులో (international border) భారత సైనిక (Indian military) కార్యకలాపాల గురించి సెక్రటరీ జనరల్ చాలా ఆందోళన చెందుతున్నారని అన్నారు. గరిష్ట సైనిక సంయమనం పాటించాలని ఆయన రెండు దేశాలకు పిలుపునిచ్చారు. భారత్‌ చర్యపై యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ థానేదర్ (US Congressman Shri Thaneder) మాట్లాడుతూ యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదని, కానీ అలాంటి ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు, ఉగ్రవాదులను (terrorists) గుర్తించి శిక్షించడం ముఖ్యమన్నారు. ఉగ్రవాదాన్ని (Terrorism) మద్దతు ఇచ్చే ఏ దేశమైనా అటువంటి చర్యలు పరిణామాలను కలిగిస్తాయని చూడడం ముఖ్యం, యునైటెడ్ స్టేట్స్ (United States) శాంతియుత దేశాలకు మద్దతు ఇవ్వాలని, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి యునైటెడ్ స్టేట్స్, భారతదేశం (india) సహకరించాలన్నారు. చాలా దేశాలు భార‌త్‌కే త‌మ మ‌ద్ద‌తుని ప్ర‌కటించిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...