Stock market | ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో, నిఫ్టీ(NIfty) ఏడు పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ కదలాడుతున్నాయి. తమపై భారత్‌(Bharath) దాడి చేసే అవకాశాలున్నాయని పాక్‌ పేర్కొంటుండడం, ఉగ్రదాడి ఘటనకు భారత్ బదులు తీర్చుకునే అవకాశాలు ఉండడం, ప్రధాని మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ కావడం, గురువారం మార్కెట్లకు సెలవు కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో, నిఫ్టీ(NIfty) ఏడు పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ కదలాడుతున్నాయి. తమపై భారత్‌(Bharath) దాడి చేసే అవకాశాలున్నాయని పాక్‌ పేర్కొంటుండడం, ఉగ్రదాడి ఘటనకు భారత్ బదులు తీర్చుకునే అవకాశాలు ఉండడం, ప్రధాని మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ కావడం, గురువారం మార్కెట్లకు సెలవు కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 80,330 వద్ద, నిఫ్టీ 15 పాయిట్ల లాభంతో 24,300 వద్ద కొనసాగుతున్నాయి. క్యూ4 ఫలితాలు బాగుండడంతో విశాల్‌ మెగా మార్ట్‌(Vishal Mega Mart) 9 శాతానికిపైగా పెరిగింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు మంచి ఫలితాలనే ఇచ్చినా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో ఒలటాలిటీ(Volitility) పెరిగింది.

Stock market | పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి..

రియాలిటీ ఇండెక్స్‌(Reality Index) 3 శాతానికిపైగా పెరగ్గా.. ఫార్మా సూచీ ఒక శాతం లాభంతో ఉంది. పీఎస్‌యూ బ్యాంక్‌(PSU bank) ఇండెక్స్‌ ఒక శాతానికిపైగా నష్టంతో కొనసాగుతోంది. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా కదలాడుతుండగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Stock market | Top Gainers..

బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 17 కంపెనీలు లాభాలతో ముగియగా 13 కంపెనీలు నష్టాలతో కొనసాగుతున్నాయి. మారుతి(Maruti) 3 శాతం పెరగ్గా.. పవర్‌ గ్రిడ్‌, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌ ఒక శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి.

Stock market | Top Losers..

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు 5 శాతానికిపైగా పడిపోయాయి. టాటా మోటార్స్‌(Tata motors) 3 శాతానికిపైగా లాభంతో ఉండగా ఎస్‌బీఐ 2.60 శాతం నష్టంతో కదలాడుతోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...