LAVA BOLD N1 Pro | ఐఫోన్‌ను తలపించే దేశీ ఫోన్.. ధర ఎంతంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LAVA BOLD N1 Pro | భారత స్మార్ట్‌ ఫోన్‌(Smart phone) మార్కెట్‌లో చైనాకు చెందిన కంపెనీల ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో.. దేశీయ కంపెనీ లావా (Domestic company lava) సైతం పోటీ ఇచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా మరో మోడల్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఐఫోన్‌ ప్రో(iPhone pro) డిజైన్‌తో తక్కువ బడ్జెట్‌లో తీసుకువచ్చిన లావా బోల్డ్‌ ఎన్‌1 ప్రో మోడల్‌ ఫోన్లు అమెజాన్(Amazon), లావా స్టోర్లతోపాటు ఆఫ్‌లైన్‌ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LAVA BOLD N1 Pro | భారత స్మార్ట్‌ ఫోన్‌(Smart phone) మార్కెట్‌లో చైనాకు చెందిన కంపెనీల ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో.. దేశీయ కంపెనీ లావా (Domestic company lava) సైతం పోటీ ఇచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా మరో మోడల్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఐఫోన్‌ ప్రో(iPhone pro) డిజైన్‌తో తక్కువ బడ్జెట్‌లో తీసుకువచ్చిన లావా బోల్డ్‌ ఎన్‌1 ప్రో మోడల్‌ ఫోన్లు అమెజాన్(Amazon), లావా స్టోర్లతోపాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ అందుబాటులో ఉండనున్నాయి. జూన్‌ 2న సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్‌ ఫీచర్స్‌, ధర వివరాలు తెలుసుకుందామా..

Display : 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే. 720 x 1600 పిక్సల్‌ రిజల్యూషన్‌. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌. ఐపీ 54 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌.

Processor : యూని ఎస్‌వోసీ టీ606 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌.

Operation system : ఆండ్రాయిడ్‌ 14.

Camera : వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్‌ మెయిన్‌ఏఐ కెమెరాతోపాటు 2 మెగా పిక్సెల్‌ డెప్త్‌ సెన్సార్‌, 5 మెగా పిక్సెల్‌ అల్ట్రావైడ్‌ కెమెరాతో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెట్‌అప్‌. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్‌ కెమెరా.

Battery : 5000 mAh. 18w ఛార్జింగ్‌ సపోర్ట్‌. యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ ఛార్జర్‌.

colors : టైటానియం గోల్డ్‌, స్టెల్త్‌ బ్లాక్‌.

LAVA BOLD N1 Pro | Other features..

ఎలాంటి బ్లోట్‌వేర్‌ లేకుండా క్లీన్‌ యూఐతో అందుబాటులోకి తెచ్చారు. సురక్షిత అన్‌లాకింగ్‌ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్​ స్కానర్‌ అమర్చారు. ఫేస్‌ అన్‌లాక్‌ సౌకర్యమూ ఉంది.

Variant :
4 జీబీ రామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌తో విడుదలవుతున్న ఫోన్‌ ధర రూ. 6,999.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...