అక్షరటుడే, ఇందూరు: Osmania University | జిల్లాలోని చందూరు మండలం కారేగాం తండాకు (Karegam Thanda) చెందిన రామావత్ లాల్ సింగ్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ (Doctorate) ప్రకటించింది.
లాల్ సింగ్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj Government Degree College) రెండు డిగ్రీలు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఆచార్య విశ్వవిద్యాలయంలో(Acharya University) మాస్టర్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు. 2018లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ సీటు సాధించి స్వాతంత్రం అనంతరం ‘దేశంలోని సంస్కృతి సంప్రదాయాల మధ్య జరుగుతున్న ఘర్షణ’పై పరిశోధన చేశారు.
హిందీ విభాగంలో “సమకాలిన్ హిందీ ఉపన్యాస్ మే సాంప్రదాయక్ సంఘర్ష (1950-2000)” అనే అంశంపై ఆయన సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన ఓపెన్ వైవాలో రిటైర్డ్ ప్రొఫెసర్ అవినాష్ జైస్వాల్ పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఎక్స్టర్నల్ ఎగ్జామినేటర్ ప్రొఫెసర్ జయకిషన్, నాంపల్లి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చంద్రముఖి ముఖర్జీ సంతృప్తి వ్యక్తం చేసి డాక్టరేట్ ను ప్రకటించారు.