53
అక్షరటుడే, ఇందూరు: Bangladeshi players | ఐపీఎల్లో బంగ్లాదేశ్ క్రీడాకారులకు (Bangladeshi players) స్థానం కల్పించొద్దని హిందూ ఐక్యవేదిక ప్రతినిధి ప్రసాద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని (Nizamabad city) దేవీ రోడ్ చౌరస్తాలో బుధవారం రాత్రి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు చేయడం దారుణమన్నారు. ఇందుకు నిరసనగా ఆ దేశ ఆటగాళ్లకు చోటు కల్పించకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఐపీఎల్ ప్రతినిధులు ఆలోచించి బంగ్లాదేశ్ క్రీడాకారులను వెనక్కి పంపాలన్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌కు సరైన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.