HomeUncategorizedKarnataka Deputy CM | క్ష‌మాప‌ణ‌లు చెప్పిన డీకే శివ‌కుమార్‌.. ఎందుకంటే..

Karnataka Deputy CM | క్ష‌మాప‌ణ‌లు చెప్పిన డీకే శివ‌కుమార్‌.. ఎందుకంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka Deputy CM | ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం ద్వారా సొంత పార్టీ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు క‌ర్ణాట‌క ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Karnataka Deputy CM DK Shivakumar) మంగ‌ళ‌శారం క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. తన చర్య వల్ల కాంగ్రెస్, ఇండి కూటమి బాధపడితే తాను క్షమాపణలు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు.

బెంగ‌ళూరులో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. పుట్టుక నుంచి కాంగ్రెస్​లోనే ఉన్నాన‌ని, చ‌నిపోయే దాకా కాంగ్రెస్‌లోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. 11 మంది మృతి చెందిన చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘ‌ట‌న‌పై అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చ సందర్భంగా శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని(RSS Anthem) ఆలపించారు. దీనిపై సొంత పార్టీ నేత‌ల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం లేద‌నే ఆయ‌న బీజేపీ వైపు వెళ్లేందుకు ఇలా చేశార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. తాజాగా వాటిని ఖండించిన డీకే తాను కాంగ్రెస్‌(Congress)లోనే ఉంటాన‌ని చెప్పారు.

Karnataka Deputy CM | క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా..

త‌న చ‌ర్య‌ల వ‌ల్ల ఎవ‌రైనా బాధ ప‌డితే క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని డీకే తెలిపారు. “ఎవరైనా బాధపడితే, నేను క్షమాపణలు కోరుతున్నాను. కాంగ్రెస్ పట్ల, గాంధీ కుటుంబం పట్ల నా విధేయతను ఎవరూ ప్రశ్నించలేరు. నేను పుట్టినప్ప‌టి నుంచి కాంగ్రెస్‌వాడిని, కాంగ్రెస్ వాదిగానే నేను చనిపోతాను” అని అన్నారు. త‌న వ్యాఖ్య‌ల విష‌యంలో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎవ‌రి మ‌నోభావాల‌ను దెబ్బ తీయాలాని తాను కోరుకోవ‌డం లేద‌ని, ఎవ‌రైనా బాధి ప‌డి ఉంటే వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నుకుంటున్నాన‌ని తెలిపారు. గాంధీ కుటుంబాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, తాను జన్మతః కాంగ్రెస్ సభ్యుడిని. నేను కాంగ్రెస్ సభ్యుడిగా చనిపోతానని చెప్పారు. పార్టీల‌కు అతీతంగా త‌న‌కు ఎంత మందో అనుచ‌రులు, స్నేహితులు ఉన్నార‌ని, వారెవ‌రిని బాధ పెట్ట‌కూడ‌ద‌ని అనుకుంటున్న‌ట్లు వివ‌రించారు.