Homeబిజినెస్​Stock Market | స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి కాంతులు.. భారీగా పెరిగిన సూచీలు

Stock Market | స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి కాంతులు.. భారీగా పెరిగిన సూచీలు

మార్కెట్లలో బుల్‌(Bull) జోరు చూపింది. దీంతో ప్రధాన సూచీలు ఆల్‌టైం హైకి చేరువయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక శాతానికిపైగా పెరిగాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్ల(Domestic Stock Market)లో పండుగ వాతావరణం నెలకొంది. ఇన్వెస్టర్లను సంతోషపరుస్తూ అన్ని రంగాల షేర్లు రాణించాయి. దీంతో ప్రధాన సూచీలు ఆల్‌టైం హైకి చేరువయ్యాయి.

గురువారం ఉదయం సెన్సెక్స్‌ 189 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 71 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో కొంత ఒడిదుడుకులకు లోనయినా ఆ తర్వాత ప్రధానమైన రెసిస్టెన్స్‌లను దాటుకుంటూ స్థిరంగా పైపైకి వెళ్లాయి. ఇంట్రాడే(Intraday)లో సెన్సెక్స్‌ 83,615 పాయింట్ల గరిష్ట స్థాయిని, నిఫ్టీ 25,625 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 862 పాయింట్ల లాభంతో 83,467 వద్ద, నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో 25,585 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market | ఎందుకు పెరిగాయంటే..

కంపెనీల క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలకు మించి ఉంటుండడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, జీఎస్టీ సంస్కరణల(GST Reforms) నేపథ్యంలో క్యూ3 ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఆశావహ దృక్పథంతో సాగుతున్నారు. భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు చిగురిస్తుండడం, ఐఎంఎఫ్‌ భారత జీడీపీ(GDP) వృద్ధి రేటు అంచనాలను పెంచడం, రూపాయి బలపడుతుండడం వంటి అంశాలు బుల్స్‌ పైచేయి సాధించడానికి దోహపడ్డాయి.

Stock Market | ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, ఆటో షేర్లలో దూకుడు..

క్యాపిటల్‌ మార్కెట్‌ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌(Banking), ఆటో షేర్లలో దూకుడు కనిపించింది. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్‌ 1.87 శాతం పెరగ్గా.. ఎఫ్‌ఎంసీజీ(FMCG) 1.74 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ ఇండెక్స్‌ 1.51 శాతం, బ్యాంకెక్స్‌ 1.27 శాతం, ఆటో 1.15 శాతం, కమోడిటీ 0.76 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.74 శాతం, మెటల్‌ 0.69 శాతం, ఎనర్జీ 0.62 శాతం పెరిగాయి. క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ 0.77 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.50 శాతం నష్టపోయాయి. లార్జ్‌ క్యాప్‌(Large cap) ఇండెక్స్‌ 0.93 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.48 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం లాభంతో ముగిశాయి.

Stock Market | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,378 కంపెనీలు లాభపడగా 1,809 స్టాక్స్‌ నష్టపోయాయి. 147 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 165 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 92 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 5 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2.3 లక్షల కోట్ల మేర పెరిగింది.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 28 కంపెనీలు లాభాలతో ఉండగా.. 2 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. కొటక్‌ బ్యాంక్‌ 2.67 శాతం, టైటాన్‌ 2.63 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.33 శాతం, అదానిపోర్ట్స్‌ 1.97 శాతం, ఎంఅండ్‌ఎం 1.82 శాతం పెరిగాయి.

Losers : ఎటర్నల్‌ 1.73 శాతం, ఇన్ఫోసిస్‌ 0.08 శాతం నష్టపోయాయి.