అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Diwali Faestival | దసరాకి తెలుగులో స్ట్రెయిట్ సినిమాల కొరత ఉన్నా డబ్బింగ్ సినిమాలు ఆ ఖాళీని పూడ్చాయి. ధనుష్ “ఇడ్లీ కొట్టు”, రిషబ్ శెట్టి “కాంతార: చాప్టర్ 1” ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. అయితే, దసరా ముగియగానే దీపావళి సీజన్ మొదలైంది.
అక్టోబర్ 21న దీపావళి పండుగ (Diwali Faestival)జరుపుకోనుండగా, ప్రేక్షకుల్లో ఇప్పటికే పండుగ మూడ్ మొదలైంది. ఈ సారి బిగ్ స్టార్ సినిమాలు లేకపోయినా, మిడ్ రేంజ్ హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హవా చూపించేందుకు రెడీ అయ్యాయి.
ఈ దీపావళికి ఏకంగా 7 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో నాలుగు స్ట్రెయిట్ సినిమాలు కాగా, మూడూ డబ్బింగ్ చిత్రాలు.
అక్టోబర్ 16 – మిత్ర మండలి
ప్రియదర్శి, వెన్నెల కిశోర్, సత్య, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన పూర్తి కామెడీ ఎంటర్టైనర్. డైరెక్టర్ విజయేందర్ రెడ్డి (Director Vijayender Reddy)ఈ సినిమాను రూపొందించగా, బన్నీ వాస్ సమర్పణలో విడుదలవుతుంది. డైలాగ్ కామెడీ నేపథ్యంలో దీపావళికి నవ్వులు పంచే మూవీగా భావిస్తున్నారు.
అక్టోబర్ 17 – తెలుసు కదా
సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)ముఖ్య పాత్రల్లో నటించిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహించారు. ట్రైలర్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.
అక్టోబర్ 17 – డ్యూడ్ (తమిళ డబ్బింగ్)
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తమిళ చిత్రం. లవ్ టుడే, డ్రాగన్ వంటి హిట్‌ల తర్వాత వస్తున్న ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, మమిత బైజు హీరోయిన్.
అక్టోబర్ 18 – K-ర్యాంప్ (K- Ramp)
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లతో బజ్ క్రియేట్ చేసింది. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని మలిచారు.
అక్టోబర్ 21 – థామా (హిందీ డబ్బింగ్)
రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలవుతోంది.
అక్టోబర్ 24 – బైసన్
విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టించేందుకు రెడీ.
అక్టోబర్ 24 – ఎర్ర చీర
సుమన్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ డ్రామాలో రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించారు. హారర్, సెంటిమెంట్ మిక్స్‌తో రూపొందిన ఈ చిత్రం చివరగా విడుదల కాబోతుంది.
ఈ దీపావళి సినిమాల హడావుడితో థియేటర్లు (Theaters)పండగ వాతావరణాన్ని తలపించనున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో చూడాలి!