అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Divya Bharati | తమిళ భామ దివ్యభారతి పేరు వినగానే యూత్‌లో క్రేజ్ ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది. బ్యాచిలర్ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ అందుకున్న ఈ అందాల భామ, సోషల్ మీడియా (Social Media)లో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెగ్యులర్‌గా వైరల్ అవుతూనే ఉంది.
ప్రస్తుతం వరుస తమిళ సినిమా (Tamil Cinema)లతో బిజీగా ఉన్న దివ్యభారతి, తెలుగులో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న గోట్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ (YouTube Channel)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యభారతి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా తన ప్రేమకథ గురించి తొలిసారి ఓపెన్‌గా మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Divya Bharati | విచిత్ర ప్రేమాయణం..
దివ్యభారతి మాట్లాడుతూ…తాను డిప్లమోలో ఐటీ చదివిన రోజుల్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో కొందరు తనకు ప్రపోజ్ చేశారని, ఒక అబ్బాయి అయితే తనను బాగా ఫాలో అయ్యేవాడని చెప్పింది. వర్క్‌షాప్‌లో ఒకసారి అతని సహాయం తీసుకున్నానని, అయినా అతను ప్రపోజ్ చేసినప్పుడు మాత్రం నో చెప్పానని తెలిపింది. “ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు నేను అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు” అని స్పష్టం చేసింది. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఒక వ్యక్తి తనకు నచ్చాడని, కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే… అతను తన కాలేజీలోనే వేరే బ్రాంచ్‌కు చెందిన ప్రొఫెసర్ అని చెప్పింది. కాలేజీలో ఎవరినీ పట్టించుకోని తాను చూసిన ఒక్కరే ప్రొఫెసర్ కావడం తనకు ఆశ్చర్యంగా అనిపించిందని నవ్వుతూ చెప్పింది.
ఒకరోజు తాను అతన్ని చూస్తుండగా, అతను కూడా తన వైపు చూసాడని తెలిపింది. ఆ తర్వాత తన ఫ్రెండ్ వచ్చి “సర్ నీ నెంబర్ అడిగారు, ఇచ్చాను” అని చెప్పడంతో షాక్ అయ్యానని తెలిపింది. అతను ప్రొఫెసర్ అని అప్పటివరకు తనకు తెలియదని చెప్పింది. ఎందుకు నెంబర్ ఇచ్చావని ఫ్రెండ్‌పై కోపపడ్డానని కూడా చెప్పింది. ఆ రాత్రే అతను ఫోన్ చేసి “నువ్వు ఒక అబ్బాయిని చూసావు కదా?” అని అడిగాడని, దాంతో తాను భయపడి “అయ్యో! నేను ఏ తప్పూ చేయలేదు, ఎవ్వరినీ చూడలేదు” అని చెప్పానని గుర్తు చేసుకుంది. అప్పుడు అతను “అది కాదు, నన్నే చూసావు” అని చెప్పడంతో షాక్ అయ్యి సారీ చెప్పానని తెలిపింది. ఆ ప్రొఫెసర్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని, స్టూడెంట్స్‌కు ఎప్పుడూ హెల్ప్ చేసే టైప్ అని దివ్యభారతి చెప్పింది. ఆ తర్వాత ఇద్దరం రెగ్యులర్‌గా మాట్లాడుకోవడం మొదలై, క్రమంగా ఒకరినొకరు ఇష్టపడినట్టు తెలిపింది.
ఎవరినీ పట్టించుకోని సర్ నా దగ్గర ఉన్నారు అనే ఫీలింగ్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది” అని చెప్పింది. కానీ ఈ విషయం తన అమ్మకు తెలిసిన తర్వాత, ఆమె జీవితంపై సీరియస్‌గా మాట్లాడిందని తెలిపింది. దాంతో కాలేజీ పూర్తయ్యాక ఆ రిలేషన్ అక్కడితో ఆగిపోయిందని చెప్పింది. “అది నిజమైన ప్రేమ కాదు అని తర్వాత అర్థమైంది. అందుకే ఎక్కువగా బాధపడలేదు” అని దివ్యభారతి చెప్పింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే… తన మొదటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రొఫెసర్ తనకు మెసేజ్ చేసి, “నువ్వు లైఫ్‌లో ఇలా ఎదగడం చూసి చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్” అని విష్ చేశారని చెప్పింది. ఈ మాటలు విని తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని దివ్యభారతి వెల్లడించింది.