అక్షరటుడే, ఇందూరు: Panchayat elections | గ్రామ పంచాయతీ ఎన్నికలకు (Gram Panchayat elections) అధికార యంత్రం సమాయత్తమవుతోంది. డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
సర్పంచ్, వార్డు సభ్యుల (Sarpanch and ward members) రిజర్వేషన్లను సైతం సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎన్నికల సందడి మొదలుకానుంది. బ్యాలెట్ బాక్స్‌లను సైతం ఆయా మండలాలకు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం 545 సర్పంచ్, 5022 వార్డు స్థానాలకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను కేటాయించారు.
